భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించిన మండల స్థాయి క్విజ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. మెదక్ జిల్లా జీనియస్ క్వెస్ట్ కార్యక్రమంలో భాగంగా నార్సింగి మండల కేంద్రంలో హైస్కూల్ విద్యార్థులకు ఈ పోటీలను నిర్వహించారు. బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ సహకారంతో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
నార్సింగి మండల కేంద్రంలో నిర్వహించిన పోటీల్లో పదో తరగతి…






