భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పట్టణంలోని జాతీయ రహదారి 765డీపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 64 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. గుర్తుతెలియని వాహనం ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయిన వృద్ధుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సిగరెట్ కొనడానికి వెళ్లి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ పట్టణంలోని శివాలయం వీధికి చెందిన…






