భారత్ సమాచార్, కరీంనగర్ జిల్లా: కార్తీక పౌర్ణమి సందర్భంగా సైదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో పండుగ సందడి నెలకొంది. ఎస్‌ఐ కొప్పుల స్వాతి తోటి పోలీసు సిబ్బందితో కలిసి కార్తీక పౌర్ణమి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో దీపాలు వెలిగించి, కాకరపుల్లలు కాలుస్తూ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. దీపాల వెలుగులు, కాకరపుల్లల సందడితో పోలీస్‌స్టేషన్‌ ఆవరణ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. పోలీసు సిబ్బంది అంతా కలిసి కార్తీక పౌర్ణమి వేడుకలను సంతోషంగా జరుపుకోవడంతో అక్కడ సందడి నెలకొంది.