భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: విద్యార్థులకు పాఠ్యాంశాలను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్పిస్తే ఆచరణాత్మక పరిజ్ఞానంతో పాటు సామాజిక బాధ్యత కూడా పెరుగుతుందని సామాజిక శాస్త్ర ఉపాధ్యాయురాలు అంజుమ్ సుల్తానా తెలిపారు. ఈ లక్ష్యంతో నెల్లికుదురు మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ 7వ తరగతి విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
రవాణా వ్యవస్థ పాఠ్యాంశంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపాల్ రావు అనుమతితో విద్యార్థులను రహదారిపైకి తీసుకెళ్లి క్షేత్ర పర్యటన నిర్వహించారు.…






