భారత్ సమాచార్, మహారాష్ట్ర: హాస్టల్లో దెయ్యాలు తిరుగుతున్నాయనే భయంతో ప్రభుత్వ బోర్డింగ్ హాస్టల్ నుంచి ఏకంగా 608 మంది విద్యార్థులు వెళ్లిపోయిన ఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో చోటుచేసుకుంది. డోమా ప్రభుత్వ బోర్డింగ్ హాస్టల్లో అర్ధరాత్రి సమయంలో విచిత్రమైన, భయానక శబ్దాలు వినిపిస్తున్నాయని కొంతమంది బాలికలు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
హాస్టల్లో దెయ్యాలు, అతీంద్రియ శక్తులు ఉన్నాయంటూ ప్రచారం జరగడంతో విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ వార్త వేగంగా వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాస్టల్‌ను విడిచిపెట్టి తమ…




