భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మళ్లీ వివాదాల్లో చిక్కుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి 3టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. హిందూ దేవుళ్లను, భారత సైన్యాన్ని, అలాగే ఆంధ్రుల జాతిని దూషించేలా వ్యాఖ్యలు చేశారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు ఇంటర్వ్యూలో పాల్గొన్న యాంకర్ స్వప్నపైనా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
పోలీసులు ఈ ఫిర్యాదు ఆధారంగా క్రైమ్ నంబర్ 487/2025 కింద కేసు నమోదు చేశారు. వర్మ…



