భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బోధన్ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న ఫ్రూట్ మార్కెట్ కాంప్లెక్స్‌లో గదుల కేటాయింపుల్లో నిబంధనలు పాటించకపోవడంపై స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఖాజీ సయ్యద్ మోయునుల్లా హుస్సేన్ నాయకత్వంలో సోమవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. కేటాయించిన పరిధిని మించి దుకాణాలు ఏర్పాటు చేసి రహదారులను ఆక్రమించడం వల్ల ట్రాఫిక్‌కు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వెనుక భాగంలోని దుకాణాలకు మార్గం లేకుండా అడ్డంకులు ఏర్పడ్డాయని…