భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: దేవనకొండ ఎంపీడీవో కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ పీడీ చిరంజీవి, ఎంపీడీవో జ్యోతి కలిసి ఇంధన పరిరక్షణ చిట్కాల వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇంధనాన్ని సమర్థంగా వినియోగిస్తే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని వారు తెలిపారు. విద్యుత్, ఇంధన వనరుల వృథాను తగ్గించడంలో ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యుత్ ఏఇ రవీంద్ర, వెంకప్ప, లైన్మెన్ రంజాన్ పాల్గొన్నారు.
దేవనకొండలో ఇంధన పరిరక్షణ పోస్టర్ విడుదల





