భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్ జిల్లా : బోధన్ మండలం నర్సాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ఫుడ్ ఫెస్టివల్’ వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్వయంగా ఇళ్లలో తయారు చేసిన వివిధ రకాల సంప్రదాయ వంటకాలను, పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగాధర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహన కల్పించడంతో పాటు, పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని…





