భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని జిల్లా సాధన కోసం ఆలూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామలింగయ్య, తాలూకా అధ్యక్షులు కొమ్మ రమేష్ మాట్లాడుతూ.. ఆదోని జిల్లా కోసం తమ పార్టీ మొదటి నుంచి పోరాడుతోందన్నారు. కూటమి ప్రభుత్వం జిల్లా ఏర్పాట్లలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, లేదంటే ఉద్యమం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆదోని జిల్లా సాధనకు ఆలూరులో నిరాహార దీక్ష



