భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ప్రభుత్వం మారి దాదాపు 20 నెలలు గడిచినా, ఆదోని మునిసిపల్ పాఠశాలలో మాత్రం ఇంకా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోస్టర్ దర్శనమిస్తోంది. పాఠశాల గ్రంథాలయంలో గత ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేసిన “జగనన్నే ముఖ్యమంత్రి” అనే పోస్టర్ ఇప్పటికీ అలాగే ఉండటం గమనార్హం. ఈ విషయంపై ఇవాళ బుధవారం పాఠశాల హెడ్‌మాస్టర్‌ను వివరణ కోరగా.. పోస్టర్ ఎత్తులో ఎక్కువగా ఉండటంతో తొలగించలేకపోయామని తెలిపారు. అయితే, త్వరలోనే ఆ పోస్టర్‌ను తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ…