భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో మంత్రాలయంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసనతో మంత్రాలయం ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ముందుగా రాఘవేంద్ర సర్కిల్‌లో రాఘవేంద్ర స్వామి విగ్రహానికి వినతి పత్రం సమర్పిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఎమ్మిగనూరును జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో పాటు మంత్రాలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, ఈ ప్రాంతంలో విమానాశ్రయం నిర్మించి స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరు…