భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జన్నారం మున్సిపాలిటీ కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కక్షపూరితంగా పేరు మార్పుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన కార్యక్రమం చేశారు. నాయకులు మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకున్న సందర్భంలో బిజెపి పార్టీ మోడీ సర్కారు కావాలని కక్షపూరితంగా మహాత్మ గాంధీ పేరుని తొలగించడం సిగ్గుచేటని అన్నారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసి స్వాతంత్ర పోరాటం భారత దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయునీ కించపరిచే విధంగా…