భారత్ సమాచార్.నెట్, మెదక్: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా తూప్రాన్ పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ ఉత్సాహంగా జరిగింది. నర్సాపూర్ చౌరస్తా నుంచి పోతరాజుపల్లి చౌరస్తా వరకు నిర్వహించిన ఈ పరుగులో దాదాపు 300 మంది యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ రంగ కృష్ణ మాట్లాడుతూ.. మన ఐక్యతే దేశానికి బలమని పిలుపునిచ్చారు.
యువత చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా, పటేల్ దార్శనికతను ఆదర్శంగా తీసుకొని దేశ సమగ్రత, భద్రత కోసం పాటుపడాలని సూచించారు.…





