భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, అర్హత కలిగిన నిజమైన జర్నలిస్టులకే కార్డులు అందేలా కమిటీ సభ్యులు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.

నిబంధనల ప్రకారం వృత్తిపరమైన ప్రమాణాలు, అనుభవం పరిగణనలోకి తీసుకోవాలని, అనర్హులు…