భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: డిగ్రీ బాలికల వసతి గృహం వార్డెన్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు లింగాల నాగరాజు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. గురువారం హాస్టల్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగరాజు మాట్లాడుతూ సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ ఉదయం వసతి గృహంలోని బాలికలకు ఉడికించిన కోడిగుడ్డు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, వార్డెన్ నిర్లక్ష్యం వలన ఇవ్వడం జరగడం లేదని అన్నారు. పెరుగుకు బదులుగా పలచని మజ్జిగ అందించడం…