భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం మండల ప్రజలకు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని నాగారం ఎస్సై చిరంజీవి హెచ్చరించారు. మంగళవారం జిల్లా ఎస్పీ నర్సింహ, డీఎస్పి ప్రసన్నకుమార్ ఆదేశాల మేరకు నాగారం పోలీస్ స్టేషన్ కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. మండల ప్రజలు న్యూఇయర్ వేడుకలను ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేడుకలను కుటుంబ…