భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: జనవరి 1వ తేదీ నూతన సంవత్సర కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఒక రోజు ముందుగానే పంపిణీ చేస్తోందని జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు. డిసెంబర్ నెలలో కర్నూలు జిల్లాలో అర్హులైన 2,37,235 మంది లబ్ధిదారులకు రూ.104.23 కోట్లు పెన్షన్లుగా పంపిణీ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. బుధవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండలం ఏ. గోకులపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి…