భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) వలిగొండ మండల సమితి సమావేశం మేడి దేవేందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్లంకి మహేష్, జిల్లా కార్యదర్శి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్లంకి మహేష్ మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీసు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన సివిల్ కానిస్టేబుల్ (కోడ్-21), ఏఆర్ కానిస్టేబుల్ (కోడ్-22) పోస్టులు లేకపోవడం జిల్లాలోని నిరుద్యోగ యువతను తీవ్ర నిరాశకు…