భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పు చేసింది. ఇప్పటివరకు ఉపయోగిస్తున్న బ్లాంక్ బార్ కోడ్ (బార్ కోడ్ లేని) OMR షీట్ల విధానానికి బోర్డు ముగింపు పలికింది. ఇకపై అన్ని ఇంటర్ పరీక్షలలో ప్రింటెడ్ బార్ కోడ్ ఉన్న షీట్లతోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత పరీక్ష సమయంలో విద్యార్థులు తమ మీడియం లేదా సెకండ్ లాంగ్వేజ్ మార్చుకోవడం సాధ్యం కాదు. పరీక్షా కేంద్రాలలో అనవసరమైన గందరగోళం లేకుండా సజావుగా…