భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: మార్గశిర అమావాస్య సందర్భంగా మద్దికేర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పంచామృతాభిషేకం, ప్రత్యేక అలంకరణ, నైవేద్యాలు, మంగళహారతి నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు విజయ్ ప్రసాద్ యాదవ్ తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్దఎత్తున విచ్చేసి తీర్థప్రసాదం, అన్నప్రసాదం అందుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు పోస్టాఫీస్ సూపరింటెండెంట్ జనార్ధన్ రెడ్డి స్వామివారిని దర్శించి పూజలు చేశారు.
మద్దికేరిలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి అమావాస్య పూజలు



