భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బోధన్ పట్టణంలోని స్థానిక లోయోల హైస్కూల్‌లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన్ టౌన్ సీఐ వెంకట నారాయణ, AMVI శ్రీనివాస్, పాఠశాల కరస్పాండెంట్ సురేష్, TRSMA నాయకులు హరికృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపకూడదని విద్యార్థులకు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది…