భారత్ సమాచార్, అనంతపురం జిల్లా: అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును పొగురూరు బ్రిడ్జిపై ఐషర్ వాహనం ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కింద పడిపోయాయి. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు అప్రమత్తమై సహాయక చర్యలు…



