• ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగస్వామ్యం

భారత్ సమాచార్, ఆంధ్రప్రదేశ్: పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెరువు వద్ద చెత్త ఊడ్చి శుభ్రతకు ప్రాధాన్యత చూపించారు. కార్మికులతో కాసేపు ఆత్మీయంగా సంభాషించి, వారి సమస్యలు తెలుసుకున్నారు.

 

అంతేకాకుండా, స్వచ్ఛరథం వాహనాలను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. గ్రామ శుభ్రత, పారిశుద్ధ్య రంగంలో ఈ వాహనాలు వినియోగం కావాలని సూచించారు. తర్వాత స్వయం సహాయక సంఘాల సభ్యులకు…