భారత్ సమాచార్, అమరావతి ; చిలుకలూరి పేట ప్రజాగళం సభలో కూటమి నాయకులు కాంగ్రెస్ పై నిరాధార విమర్శలు చేశారని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు.

‘‘అటు జగన్ను, ఇటు బాబును రెండు పంజరాల్లొ పెట్టుకుని ఆడిస్తున్న రింగ్ మాస్టర్ బీజేపీ. పదేండ్ల రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించి, ఇప్పుడు నా మీద దాడులా. కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని కూతలా ఐదేళ్లుగా జగన్ తో అంటకాగుతూ, వాళ్ళ అరాచకాలను అడ్డుకోకుండా, ఎదురు వారికి అడ్డగోలు సహాయ సహకారాలు…