భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కేంద్ర కమిటీ పరిశీలకులు హెచ్.సి. యోగేష్ తెలిపారు. సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమం భాగంగా పార్టీ పునర్నిర్మాణం జరుగుతోందని, జిల్లా, నగర కమిటీలకు కొత్త అధ్యక్షుల నియామకం చేపడుతున్నామని చెప్పారు. 29-11-2025 శనివారం సాయంత్రం 4 గంటల నుండి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పరిశీలకులు దరఖాస్తులు స్వీకరిస్తారని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలనే ఆసక్తి ఉన్న ప్రతిఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చని యోగేష్ వెల్లడించారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తుల ఆహ్వానం





