భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు ప్రజా శ్రేయస్సు కోసం కూలీలుగా మారిన ఘటన చర్చనీయాంశంగా మారింది. బుధవారం శర్భతి కెనాల్ వద్ద ట్రాఫిక్ సిబ్బంది స్వయంగా రోడ్డుపై గుంతలు పూడ్చే పనుల్లో పాల్గొన్నారు. వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్న నేపథ్యంలో వారు చేపట్టిన ఈ చర్యకు ప్రయాణికులు, స్థానికులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇదిలా ఉండగా, రోడ్ల మరమ్మత్తులు నిర్వహించాల్సిన కాంట్రాక్టర్ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం ప్రజల్లో తీవ్ర అసహనానికి దారి తీస్తోంది. సమయానికి పనులు పూర్తి చేయకుండా అధికారుల…