భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సంక్రాంతి పండుగ పురస్కరించుకొని తమ స్వగ్రామాలకు బంధువులు ఇళ్ళకు వెళ్లే వారు తగు జాగ్రత్తలు పాటించాలని నెల్లికుదురు ఎస్సై చిర్ర రమేష్ బాబు, ఇనుగుర్తి ఎస్సై గంగారపు కరుణాకర్ లు సూచించారు. ఖాళీగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎస్సై హెచ్చరించారు. సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని మండలంలో చోరీల నియంత్రణకు ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామని, రాత్రి వేళల్లో …
పండక్కి ఊరేళ్తున్నారా.. జాగ్రత్త





