భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: భైంసా బస్ స్టాండ్ ప్రాంగణంలో గల ATM మిషన్ ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి చోరీ కి విఫలయత్నం చేశారు. ఈ ఘటనలో ATM మిషన్ లో ఉన్న క్యాష్ మాత్రం అలాగే ఉంది. దుండగులు మిషన్ ను ధ్వంసం చేసేందుకు తెచ్చుకున్న ఆయుధాలను అక్కడే వదిలి వెళ్ళారు. పోలీసులు సమాచారం అందడంతో దర్యాప్తు ప్రారంభించారు. నిత్యం రద్దీగా ఉండే బస్ స్టాండ్ లో ఇలాంటి ఘటనలు జరగడంతో జనాలు ఉలిక్కి పడ్డారు.
మరిన్ని కథనాలు:





