భారత్ సమాచార్.నెట్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో రమాదేవిపై కొందరు దాడి చేశారు. ఆలయానికి చెందిన 889.5 ఎకరాల భూముల్లోని అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు సిబ్బందితో కలిసి ఆమె అక్కడికి వెళ్లారు. అయితే ఈ క్రమంలోనే ఆలయ సిబ్బంది, పురుషోత్తపట్నం గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమెపై పురుషోత్తపట్నం గ్రామస్థులు దాడి చేయగా.. ఆమె స్పృహ కోల్పోవడంతో అక్కడ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం…Bhadrachalam EO: భద్రాచలం ఆలయ ఈవోపై దాడి





