భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఆటో డ్రైవర్ అదృశ్యమైన ఘటన మాసాయిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ‘మండల కేంద్రానికి చెందిన యాదగిరి అనే వ్యక్తి వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. ఈనెల 24న ఆటో నడపడానికి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసాం’ అని అన్నారు.