భారత్ సమాచార్.నెట్, మెదక్: విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని ఇంద్రజాల ప్రదర్శకుడు కామేశ్వరరావు సూచించారు. వెల్దుర్తి మండలం హస్తాల్‌పూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం మూఢనమ్మకాలు, మంత్ర తంత్రాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రజల బలహీనతలను ఆసరాగా తీసుకుని, డబ్బుల కోసం మంత్రాలు చేస్తామంటూ మభ్యపెడుతున్నారని ఆయన తెలిపారు. మూఢనమ్మకాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వాటిని రూపుమాపేందుకే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఆయన కోరారు.