భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేటలో బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమ సూచించారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని పలు వీధులలో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఉచిత విద్య, అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన, నాణ్యమైన ఉచిత భోజనం, విద్యార్థులకు అల్పాహారం, ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని బడి ఈడు పిల్లలను ప్రభుత్వ…