భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: బసాపురం గ్రామాన్ని ఆదోని మండలంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలు సోమవారం ఉద్రిక్త ర్యాలీ నిర్వహించారు. గ్రామాన్ని పెద్ద హరివాణం మండలంలోకి మార్చే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఆదోని జిల్లా సాధన కమిటీ రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన మహిళలు, జిల్లా ఏర్పాటయ్యే వరకు పోరాటం ఆపబోమని జిల్లా ప్రధాన కార్యదర్శి మణి స్పష్టం చేశారు. అనంతరం, మహిళలు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద…