భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: సాలూరా మండల కేంద్రంలో గల ప్రజ్ఞశ్రీ హైస్కూల్ లో గురువారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థినులు, ఉపాధ్యాయురాలు సంప్రదాయ చీరలు ధరించి రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. పాఠశాల ఆవరణలో బతుకమ్మ పాటలు పాడుతూ సాంప్రదాయ నృత్యాలతో బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమైన ఈ పండుగను పూలతో, పూజలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం మంజీరా నదిలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. పాఠశాల కరస్పాండెంట్ లతా రాజు,…





