భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ పండుగ అని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగ స్త్రీ శక్తిని ప్రతిబింబించే పండుగగా నిలుస్తుందని కలెక్టర్ తెలిపారు. బతుకమ్మలు నిమ్మజ్జనంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో, సోదరభావంతో బతుకమ్మ పండుగను దిగ్విజయంగా జరుపుకోవాలని జిల్లా…
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: రాహుల్ రాజ్





