భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కారణంగా పాలిసెట్ అడ్మిషన్ల షేడ్యూల్ లో అధికారులు పలు మార్పులు చేశారు. జూన్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు 144 సెక్షన్ విధింపు కారణంగా విద్యార్ధులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ఈ చర్యలు చేపట్టారు. సాంకేతిక విద్యా శాఖ కమీషనర్, సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సవరణ నోటిఫికేషన్ ను తాజాగా విడుదల…



