భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని బీజేపీ నాయకుడు నగరూరు రాఘవేంద్ర కోరారు. కర్నూలు నగరంలో మాట్లాడిన ఆయన, ‘ప్రతి ఇంటా స్వదేశి – ఇంటింటా స్వదేశి’ లక్ష్యంగా ప్రజలు ముందుకు రావాలన్నారు.

జిల్లాలోని ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆదోని వంటి ప్రాంతాల్లో వేలాది మంది చేనేత కార్మికులు మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్నారని గోపాల్ తెలిపారు. అయితే, ఇటీవలి నెలల్లో పట్టు ముడిసరకుల ధరలు విపరీతంగా పెరగడం, ముడిసరకుల లభ్యత…