భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు చందు రాజకుమార్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్ కళాశాలలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన “ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి బీజేపీ లడాయి” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చందు రాజకుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.15 వేల కోట్ల మేర…