భార‌త్ స‌మాచార్.నెట్, వ‌న‌ప‌ర్తి: వనపర్తి పట్టణంలో తమ నాయకులపై అక్రమ అరెస్టులు, కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ బీజేపీ పార్టీ బందుకు పిలుపునిచ్చింది. ఈ పిలుపుతో పట్టణంలోని వర్తక వాణిజ్య సంఘాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాయి. ప్రధాన కూడలి వద్ద బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు డి. నారాయణ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అవమానపరుస్తూ కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మ దహనం చేసినా కేసులు నమోదు చేయలేదని, కానీ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసినందుకు…