భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలుగా ఉండటంతో పాటు భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం బొల్లారం డివిజన్ కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ, నల్ల పోచమ్మ ఆలయాల్లో విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి…