భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: వలిగొండ మండలంలోని బొల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాండు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యలో మంచి ప్రతిభ కనబర్చాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహం, సహాయ సహకారాలు అందిస్తే వారు ఉన్నత…





