భారత్ సమాచార్, బిహార్: చనిపోయాడని భావించి గంగానదిలో వదిలేసిన ఓ బాలుడు సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత ప్రాణాలతో ఇంటికి తిరిగి రావడం బిహార్‌లో సంచలనంగా మారింది. బెగూసరాయ్ జిల్లా మానోపుర్ ముషహరి గ్రామానికి చెందిన రామ్‌ప్రీత్ దాస్, కవిత దంపతుల కుమారుడు రాహుల్‌కు 12 ఏళ్ల వయసులో పాము కాటేసింది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు నది వద్దకు వెళ్లిన సమయంలో విషసర్పం కాటుకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినప్పటికీ బాలుడి పరిస్థితి విషమించిందని, చివరకు అతడు మరణించాడని…