భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని రాజకీయ పార్టీలకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మాజీ అధ్యక్షుడు వెంకటరామరాజు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, తెలుగు రాష్ట్రాల చట్టసభల్లో బ్రాహ్మణులకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. దీంతో బ్రాహ్మణుల సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించే అవకాశం కోల్పోయామని ఆయన తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు బ్రాహ్మణులకు పోటీ చేసే అవకాశం కల్పించాలని వెంకటరామరాజు కోరారు.