భారత్ సమాచార్, (నెల్లికుదురు), మహబూబాబాద్ జిల్లా: విద్యుత్ షాక్కు గురై దుక్కిటెద్దు మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలం రాజ్యా తండా గ్రామపంచాయతీ పరిధిలోని హేమ్లాతండాలో చోటుచేసుకుంది. వ్యవసాయానికి ఎంతో ఆధారంగా ఉన్న ఎద్దు మృతి చెందడంతో రైతు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
బాధిత రైతు భూక్య శివ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం వ్యవసాయ పనుల నిమిత్తం ఎద్దును మేతకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో హేమ్లాతండాలోని నల్లాల బావి సమీపంలో మేత మేస్తున్న సమయంలో త్రీఫేస్ విద్యుత్ వైర్లు తగలడంతో ఎద్దు…





