భరత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: బిఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన “ఛలో బస్ భవన్” కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం, పోలీసులు చర్యలు చేపట్టారు. పటాన్‌చెరు నియోజకవర్గం బిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి ఆదర్శ్ రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టి హౌస్ అరెస్ట్ చేశారు.  శాంతియుతంగా జరగాల్సిన ప్రజా కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించడం ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘించిందని ఆదర్శ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పెంచిన చార్జీలపై ప్రజలకు జవాబు చెప్పలేని ప్రభుత్వమే ఈ విధమైన అణచివేత చర్యలకు దిగుతోందని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన…