భారత్ సమాచార్.నెట్, మెదక్: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున అతివేగంగా వచ్చిన ఒక కోళ్ల వ్యాన్ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ నుంచి మెదక్ వైపునకు వస్తున్న ఈ వ్యాన్ మొదట ఒక ఆటోను బలంగా ఢీకొట్టింది. ఆ తర్వాత ముందుకు దూసుకెళ్లి మరో రెండు బైకులను ఢీకొట్టడంతో అవి కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పినట్లయింది. కేవలం ఆస్తి నష్టంతోనే ప్రమాదం ముగిసింది. ఈ ఘటనపై కేసు…
కోళ్ల వ్యాన్ బీభత్సం





