భారత్ సమాచార్.నెట్, శ్రీకాకుళం: సంతబొమ్మాలి మండలం పందిగుంట గ్రామంలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోరింటాకు కోసం సమీపంలోకి వెళ్లిన ఏడుగురు చిన్నారులలో ఇద్దరు, ఆడుకుంటూ ఊబిలో పడి మరణించారు.

మృతులు సందీప్, అవినాష్‌గా అధికారులు గుర్తించారు. పిల్లలు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు గుంటలో జారిపడ్డారు. ఇది గమనించిన మిగతా చిన్నారులు కేకలు వేసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే, తల్లిదండ్రులు గుంట వద్దకు చేరుకునేసరికి ఆ ఇద్దరు చిన్నారులు అప్పటికే మృతి చెందారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు…