భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు కల్పించిన మౌలిక సదుపాయాలు, పర్యవేక్షణ ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించారు. పరీక్షలు ఎలాంటి అంతరాయం లేకుండా పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులు…