భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: వలిగొండ మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువులు, విత్తనాల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుతున్నాయా అనే విషయాన్ని పరిశీలించేందుకు ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు.
ఈ సందర్భంగా దుకాణంలో అందుబాటులో ఉన్న యూరియా, డీఏపీ, ఇతర ఎరువుల నిల్వ వివరాలను కలెక్టర్ దుకాణ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న నిల్వలు, ఇప్పటి వరకు రైతులకు విక్రయించిన ఎరువుల పరిమాణం, విక్రయ…





